రైల్వేకోడూరు: బొప్పాయి పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతులు, దళారీ వ్యవస్థ, వ్యాపారస్తులతో సమన్వయం చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ రైతులతో అన్నారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలం హార్టికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో బొప్పాయి రైతులు, రైతు సంఘాలు, ట్రేడర్స్ వ్యాపారస్తులతో ధరలపై నిర్వహించిన అవగాహనా సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శ్రీధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్