సీఎం రాకకు ముందే ఒంటిమిట్టలో ప్రమాదం తప్పింది

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయం సమీపంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు కొద్ది నిమిషాల ముందు జనరేటర్ పేలింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతం పొగతో కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జనరేటర్‌లోని డీజిల్ ట్యాంక్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. ముఖ్యమంత్రి చేరుకోవడానికి రెండు నిమిషాల ముందే ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగించింది.

సంబంధిత పోస్ట్