ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం 30న

ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 30న ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి ఎంపీడీవో రమణ ప్రకాశ్ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రెవెన్యూ, వ్యవసాయం, పాశుపోషణ వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, మండల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్