సిద్ధవటం: అమ్మ జన్మనిస్తే.. హెల్మెట్ పునర్జన్మనిస్తుంది

మంగళవారం సాయంత్రం సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై హారిక ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమని, 'అమ్మ జన్మనిస్తే. హెల్మెట్ పునర్జన్మనిస్తుంది' అని ఆమె పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా హెల్మెట్, సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలకు రూ. 185 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్