బుధవారం, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన సుండుపల్లి మండల కేంద్రంలోని పీలేరు రోడ్డులో ఉన్న రైతు సేవా కేంద్రం పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు, స్టాక్ రికార్డులను పరిశీలించి, ఇంధన కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాలకు ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగించాలని సూచించారు. స్టాక్ వివరాలను ఉన్నతాధికారులకు నిరంతరం తెలియజేయాలని ఆదేశించారు.