సుండుపల్లె: ఆక్రమణ నిర్మాణం తొలిగింపు

ప్రభుత్వ స్థలం ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఇంటి నిర్మాణాని కోర్టు ఆదేశాల మేరకు తొలగించినట్లు తహసీల్దార్ మహబూబ్ చాంద్ తెలిపారు. శుక్రవారం సుండుపల్లె మండలం బుర్రలదిన్నె పల్లిలో సర్వే నెంబర్ 395లో ఉన్న రహదారిని ఓ వ్యక్తి ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. వ్యవసాయ భూములకు వెళ్లే రహదారి కావడంతో కొన్ని నెలల క్రితం ప్రజలు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అక్రమ నిర్మాణం తొలగించాలని కోర్టు ఆదేశించిందని తహసీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్