సుండుపల్లి: వాహన రికార్డులు సక్రమంగా ఉండాలి: ఎస్సై

మంగళవారం సాయంత్రం సుండుపల్లి మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై హుస్సేన్ మాట్లాడుతూ, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి రికార్డులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి, రికార్డులు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్