సుండుపల్లిలో వాహనాల తనిఖీ - హెల్మెట్ లేకుంటే చలానాలు

సుండుపల్లి మండల కేంద్రంలో ఎస్.ఐ. ఎస్. కే. యం. హుస్సేన్ మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులను పరిశీలించి, హెల్మెట్ ధరించని వారికి చలాన్లు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్.సి., ఇన్సూరెన్స్ వంటి రికార్డులను వాహనంలోనే ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్