అసోసియేషన్లో భారీ మెజారిటీతో గెలిచిన రెడ్డి భాషకు ఘన సన్మానం

రాయచోటిలో 2026-27 సంవత్సరానికి జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా 40 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన రెడ్డి భాషను న్యాయవాదులు సోమవారం ఘనంగా సన్మానించారు. మొత్తం 110 ఓట్లలో 74 ఓట్లు సాధించి విజయం సాధించిన ఆయనను బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. గత 15 ఏళ్లుగా ఆదాయ వ్యయాల రికార్డులను కచ్చితంగా నిర్వహించిన నిబద్ధత వల్లే ఈ విజయాన్ని సాధించారని తెలిపారు. న్యాయవాదుల విశ్వాసంతో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్