అన్నమయ్య: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

రాయచోటిలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాసవారీ నిఘాలో భాగంగా యంత్రాల భద్రత, బీయూ, సీయూ, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. గోదాము వద్ద 24/7 పటిష్ట నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు. పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.

సంబంధిత పోస్ట్