శక్తి యాప్ మహిళలకు అభయ అస్త్రంగా పని చేస్తుందని ఆపద, అత్యవసర సమయంలో శక్తి యాప్ తోనే మహిళలు, విద్యార్థులకు భద్రత, రక్షణ లభిస్తుందని పోలీసు అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్క మహిళ ఫోన్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసు అధికారులు శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత ఆవశ్యకత గురించి తెలిపారు.