గాలివీడు మండల ఎస్ఐ నరసింహారెడ్డి బుధవారం మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, న్యూ ఇయర్ వేడుకలను ఇంటివద్దే పరిమితంగా నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి 12 తర్వాత రోడ్లపై కేక్ కటింగ్‌లు, బైక్‌లతో శబ్దం చేస్తూ తిరగరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.