గాలివీడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలివీడు మండలం నూలివీడు గ్రామంలో శనివారం సౌరశక్తితో పనిచేసే రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకు గ్రామస్తులు చిరసాని సురేంద్ర రెడ్డి సహకరించారు. ఈ కెమెరాల ఏర్పాటుతో గ్రామ భద్రత మెరుగుపడి, నేరాల నియంత్రణకు దోహదపడుతుందని పోలీసులు తెలిపారు. సహకరించిన దాతకు, పోలీస్ శాఖకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.