అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం.. ఎస్పీ ధీరజ్ కఠిన ఆదేశాలు

అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం ఆదేశించారు. అక్రమ మద్యం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలని, మహిళల భద్రత కోసం ‘శక్తి’ టీమ్స్ ద్వారా రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, సోషల్ మీడియా వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగు, అక్రమ రవాణాను గుర్తించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌పై తనిఖీలు పెంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్