మదనపల్లి: హోంగార్డు కుటుంబానికి పోలీసుల సహాయం

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పవన్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో, అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లా హోంగార్డులు తమ ఒక రోజు అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 2,30,000 సేకరించిన చెక్కును ఎస్పీ ధీరజ్ సోమవారం తన కార్యాలయంలో పవన్ కుమార్ రెడ్డి తల్లి రాధకు అందజేశారు. సేవలో సహచరులను కోల్పోవడం బాధాకరమని, పోలీసు శాఖ ఎప్పటికీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్