బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవిన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది సమస్యల పై వివిధ అంశాలు చర్చించారు.