రాయచోటి: వీరభద్ర స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా మనోజ్

రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా తిరుమల మనోజ్ కుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆలయ ఈవో డీవీ రమణా రెడ్డి వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్