పాత రామాపురంలో గురువారం పర్యటించిన సీపీఐ బృందం, గ్రామంలో వీధిలైట్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు, మహిళా సమాఖ్య నేత మర్రి సుమిత్ర డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో చీకటి వల్ల ప్రజలు భయపడుతున్నారని, మురుగునీరు రోడ్లపైనే చేరి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.