అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పట్టణంలో అక్రమ మందుల విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఈగుల్ సెల్ సంయుక్తంగా శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. పటేల్, ప్రగతి మెడికల్ షాపులతో పాటు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా NRX డ్రగ్స్‌కు చెందిన అల్ట్రా సెట్, ఆల్ప్రాజోలామ్, క్లోనాజెపామ్ వంటి మందులను విక్రయించరాదని హెచ్చరించారు. విక్రయ సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.