అన్నమయ్య జిల్లాలో 14 మంది ఎస్ఐల బదిలీలు

అన్నమయ్య జిల్లాలో మొత్తం 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో భాగంగా కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దిలీప్ కుమార్‌ను అనంతపురం రేంజ్‌ విఆర్‌ విభాగానికి బదిలీ చేశారు. ముదివేడు పోలీస్‌ స్టేషన్‌కు కొత్త ఎస్సై నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఎస్సై దిలీప్ కుమార్ మదనపల్లె, నిమ్మనపల్లి పోలీస్‌ స్టేషన్లలో కూడా విధులు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్