ములకలచెరువు మండలంలోని బురకాయలకోట గ్రామపంచాయతీకి మంగళవారం జరిగిన వేలంపాటలో రూ.1,25,100 ఆదాయం లభించింది. ఈ వేలంపాటను మదనపల్లె డిఎల్పిఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో మోహన ప్రతాప్, సర్పంచ్ విజయరవి శేఖర్ రెడ్డి, కార్యదర్శి మహమ్మద్ ఆజాద్ పర్యవేక్షించారు. వారపు సంత వసూళ్ల వేలంపాటను హెచ్చు పాట దారులు విశ్వనాథ్ నాయుడు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహబూబ్ బాషా, హైస్కూల్ మాజీ సిబ్బంది హైదరవలి, పూల నాగరాజు, బిల్ రైటర్ సిద్దయ్య, ప్రజలు పాల్గొన్నారు.