జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పెద్దమండెం మండలం కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన సమీక్షించారు. ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా పాటించాలని, విధుల్లో పారదర్శకత చూపాలని, ప్రజల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని, భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.