కురబలకోట మండలంలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష ధోరణిపై బాధితుడు నూర్ బాషా నజీర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో హాజరైన ఆయన, బాపనపల్లికి చెందిన కొందరికి గ్రామ కంఠంలో పొజీషన్ సర్టిఫికెట్లు జారీ చేసి పరోక్షంగా గొడవలకు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీన గ్రామస్తులు తనపై మూకుమ్మడిగా దాడి చేసి చేయి విరగ్గొట్టినప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.