రామసముద్రం మండల కేంద్రంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో శుక్రవారం ఎరుకల సంఘం నూతన మండల కమిటీ నియామకం జరిగింది. మండల అధ్యక్షుడు ఈశ్వరప్ప, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కృష్ణప్ప, గౌరవ సలహాదారులుగా అమరప్ప, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, కార్యదర్శులుగా రంజిత్, విజయ్ కుమార్, కోశాధికారి గా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.