టోల్‌గేట్‌ అక్రమ వసూళ్ల కేసులో కాకాణికి బెయిల్‌ మంజూరు

టోల్‌గేట్‌ అక్రమ వసూళ్ల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణికి బెయిల్‌ మంజూరు అయింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నాలుగో అదనపు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కృష్టపట్నం పోర్టు వద్ద అనధికార టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి వసూళ్లు చేసిన కేసులో కాకాణి ఏ1గా ఉన్నారు.  కాకాణి స్వలాభం కోసం సొంతంగా లాజిస్టిక్‌ కంపెనీ ఏర్పాటు చేసి.. కేవలం 20 అడుగుల పొడవున్న కంటెయినర్ల నుంచి వసూలు చేసిన మొత్తమే రూ.44 కోట్లు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు.

సంబంధిత పోస్ట్