ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్లు సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. ట్రైన్ నంబర్ 18501/18502 విశాఖపట్నం - కొల్హాం, కొల్హాం - విశాఖపట్నానికి వీక్లీ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమేష్ కోరారు. మరిన్ని వివరాలకు సమీప రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.