జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.117.03 కోట్ల పింఛన్ల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లాకు కొత్తగా 423 స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.