కాకినాడ సూర్యనారాయణపురంలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 1, 2, 3 టౌన్ CIల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, నిషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈగల్ టీం బృందాలు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.