కాకినాడ బాణసంచా పేలుడు: 18 మంది మృతి, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ఘటనపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పేలుళ్లకు గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్