పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జీతాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా, బుధవారం పిఠాపురంలోని దేవుని పిల్లలకు జనసేన నాయకులు డా.వరలక్ష్మి, బాలిపల్లి అనిల్ రూ. 5,000 చెక్కులను అందజేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు పంపడంపై బాధితులు, చిన్నారుల బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ చూపుతున్న మానవత్వంపై వారు ప్రశంసలు కురిపించారు.