పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారంతో కార్యాలయంలో పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 4న కొత్తపేట DLDO రాజారావును పిఠాపురం కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చినా, వారం దాటినా ఆయన బాధ్యతలు తీసుకోలేదు. గతంలో పనిచేసిన కనకారావు సామర్లకోట వెళ్లడంతో, కార్యాలయంలో ఫైళ్లు కదలడం లేదని, పనులు ఆగిపోయాయని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.