అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్ లోనే ఆర్జిత సేవలు!

అన్నవరం దేవస్థానంలో పూజలు, ఆర్జిత సేవలు, అలంకారాలను ఆన్లైన్ చేయాలని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. భక్తులకు సమాచారం వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనివల్ల భక్తులకు సేవల బుకింగ్ సులభతరం కావడంతో పాటు ఆలయ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్