కాశీబుగ్గ విషాదం.. ఇకపై ప్రైవేట్ ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ

AP: శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు ప్రైవేట్ దేవాలయంలో జరిగిన దుర్ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించి, విధివిధానాలను రూపొందిస్తామని, ప్రైవేట్ ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్