ఎప్పటికప్పుడు పరిస్థితిని నాకు తెలియజేయండి: మంత్రి గొట్టిపాటి

AP: ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి ఎక్కడైనా విద్యుత్ నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. గత అనుభవాల ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్