‘దీపం 2’ పథకంలో కీలక మార్పులు

AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దీపం 2’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సిలిండర్ తీసుకున్న తర్వాత రాయితీ సొమ్ము ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతుందో తెలియదు. దాంతో రాయితీ జమ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏ నెలల గ్యాస్ సిలిండర్ తీసుకుంటే, ఆ తర్వాత నెలలోని ఒక ఫిక్స్డ్ తేదీన రాయితీ జమ చేయనుంది. త్వరలోనే కచ్చితమైన తేదీని ముందే ప్రకటించనుంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1.61 కోట్ల మంది ప్రయోజనం లభించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕