అమలాపురం: విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ అందించాలి

విశ్వకర్మ యోజన పథకంలో చేతి వృత్తుల వారికి శిక్షణ అందించాలని కోనసీమ జిల్లా దుర్గా మల్లేశ్వర స్వామి కార్పెంటర్ చేతి వృత్తుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మూర్తి కోరారు. అమలాపురం సంగం కార్యాలయంలో మంగళవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ జరిగింది. రెడీమేడ్ వస్తువుల వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికులను ఆదుకోవాలన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్