అంతర్వేదిలో 35 వేల మందికి తాగునీరు: కలెక్టర్

అంతర్వేదిలోని 13 నివాస ప్రాంతాల్లో 35 వేల మందికి జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందిస్తామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడిమెల్లంక పథకం ద్వారా ఇప్పటికే 97 ప్రాంతాలకు నీరు అందుతోందని చెప్పారు. ఈ ప్రాంత భౌగోళిక సమస్యలను అధిగమించి తాగునీటి పరిష్కారానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎంతో కృషి చేశారని కలెక్టర్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్