ఈనెల 28 వరకు సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమలు

అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అమలాపురం టౌన్, రూరల్, అల్లవరం సహా పలు మండలాల్లో ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కాలంలో సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్