ముఖ్యమంత్రి పర్యటన: 1200 మంది పోలీసులతో బందోబస్తు

నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సూచనలు జారీ చేస్తూ, బందోబస్తు కోసం 1200 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసులు అదనపు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పదంగా కనిపించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, సభ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాలు సమీపంలో ఉన్నందున మరింత జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్