కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో కార్యాలు చందర్రావు, కార్దాల ఏసుబాబు, కార్దాల ప్రకాశరావులను అతి దారుణంగా బుల్లి అప్పన్న, మోషే, బోజ్జయ్య తదితరులు హత్య చేయడం జరిగిందని బాధితురాలు కె. నవ్య పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వేట్లపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులపై రౌడీషీట్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.