ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం కాకినాడలో శనివారం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సమావేశంలో రైతులు పండించిన పంటను అధికారులు సూచించిన రైస్ మిల్లర్లకు అమ్మకాలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం అంశంపై ఎమ్మెల్యేలు, అధికారులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన జెడ్పీ సాధారణ సర్వ సభ్య సమావేశం జరిగింది.