పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారం కొత్తపేట నియోజకవర్గం లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్య స్నానాలు ఆచరించి సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీఉమా కొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.