కొవ్వూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

కొవ్వూరు మండలం కాపవరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్