బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో మండలంలో బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కాట్రేనికోన పోలీసులు శనివారం రాత్రి హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్‌ల ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రీడలను కేవలం వినోదం కోసమే చూడాలని, జూదంగా మార్చవద్దని హితవు పలికారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే పోలీసులకు తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్