భర్త మందలించడానే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం తెలిపిన వివరాలు ప్రకారం లంపకలోవ గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబుకు ముగ్గురు సంతానం. ఫిబ్రవరి 3వ తేదీన పిల్లలు టీవీ రిమోట్ పాడు చేయడంతో ఆమెను మందలించగా భవానీ(22) గడ్డి మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.