రాజమండ్రి రైల్వే స్టేషన్ రూ.274 కోట్లతో అభివృద్ధి: ఎంపీ పురందేశ్వరి

రాజమండ్రి రైల్వే స్టేషన్ ను రూ.274 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఆధునిక మౌలిక వసతులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో స్టేషన్ను అత్యాధునికంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రాజమండ్రి నగరానికి మరింత గుర్తింపు లభించనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్