రాజమండ్రి డిపోలో ఆర్టీసీ హెడ్ ఆఫీస్ సిఎంఈ ఇన్స్పెక్షన్

రాజమండ్రి ఆర్టీసీ గ్యారేజీ నందు టెక్నికల్ ఆడిట్ సందర్భంగా హెడ్ ఆఫీస్ CME శ్రీ కె. వెంకటేశ్వర రావు మంగళవారం విచ్చేయడం జరిగినది. నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ను సందర్శించారు. పనులను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తదుపరి గ్యారేజీ నందు అన్ని భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్సులను ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారో గమనించి పలు సూచనలు, సలహాలు ఇచ్చినారు. పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని బస్సులు ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆపరేట్ చేయాలని ఆదేశించారు. ఈ ఆడిట్లో Dy. CME తూ. గో జిల్లా రవిశంకర్, AME కవిత, డిపో మేనేజర్ కె. మాధవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕