రామచంద్రాపురం: స్థానిక నేతల సహకారంతో గ్రామ సమస్యలకు పరిష్కారం

స్థానిక నేతల సహకారంతో గ్రామ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామం గ్రామంలో ఆదివారం మన గ్రామం మన సుభాష్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్