కోనసీమ, రాజోలు నియోజకవర్గంలోని చింతలపల్లి కలింగల్ వద్ద ప్రమాదకరమైన మలుపు వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని మంగళవారం స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మలుపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కాలేజీ విద్యార్థులకు తృటిలో తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.