వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను అధికారులు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సమీక్ష చేశారు. జిల్లాలో అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ప్రథమ స్థాయిలో నిలపాలన్నారు.